బీజేపీ “బస్తీ నిద్ర” కార్యక్రమం, నాయకులు పాల్గొనాలని బండి సంజయ్ పిలుపు

GHMC Elections: BJP Plans To Conduct Basti Nidra Program from Tomorrow

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ “బస్తీ నిద్ర” కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ వెల్లడించారు. బస్తీ నిద్ర కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అన్ని డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ బస్తీ నిద్ర కార్యక్రమంలో మంగళవారం నాడు తాను పాల్గొంటానని, అలాగే పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కూడా పాల్గొంటారని చెప్పారు.

బస్తీ నిద్ర కార్యక్రమం ద్వారా సామాన్యులు నివసించే ప్రాంతాల్లోనే నిద్ర చేసి, బస్తీల్లో వారు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుని వారితో మమేకం కావాలని నాయకులను కోరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కార్పొరేటర్లు గెలిచిన తరువాత కూడా “బీజేపీ బస్తీ నిద్ర” కార్యక్రమాన్ని కొనసాగించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తారనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నానని బండి సంజయ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =