డిసెంబర్ నెలాఖరుదాకా స్కూల్స్ తెరవొద్దని నిర్ణయం

#Karnataka, Karnataka govt decides not to reopen schools, Karnataka Govt has Decided to Close the Schools, Karnataka Govt has Decided to Close the Schools till December 31, Karnataka School Reopening, Karnataka School Reopening 2020, Karnataka Schools Reopening, Karnataka Schools Reopening News, Mango News Telugu, Schools Reopening News, till December 31

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభంపై ముందుగా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. అలాగే డిసెంబరు నెలాఖరుదాకా పాఠశాలలను తిరిగి తెరవకూడదని ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు కర్ణాటక సీఎం యడియూరప్ప ప్రకటించారు. తదుపరి నిర్ణయం వెలువడే వరకు ఎస్ఎస్ఎల్సీ, మరియు పీయూసీ విద్యార్థులకు పాఠశాల మూసేఉంటాయని పేర్కొన్నారు.

ముందుగా డా.ఎం.కె సుదర్శన్ నేతృత్వంలోని సాంకేతిక సలహా కమిటీ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సమీక్షించిన అనంతరం పాఠశాలలను తిరిగి తెరవవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నవంబర్ 17 నుండి కళాశాలలు తిరిగి ప్రారంభమైనప్పటికీ, విద్యార్థుల హాజరు చాలా తక్కువగా ఉందని కమిటీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెల చివరిలో మళ్ళీ కమిటీతో సమావేశమవుతామని, అప్పటి పరిస్థితులపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం యడియూరప్ప ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + nineteen =