విద్యుత్ కోతలు దసరా కానుకలా?- పవన్ కళ్యాణ్

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Janasena Pawan Kalyan Latest Updates, Janasena Pawan Kalyan Tweets About Current Cuts In, Mango News Telugu, Pawan Kalyan Tweets About Current Cuts, Pawan Kalyan Tweets About Current Cuts In Andhra Pradesh, Pawan Kalyan Tweets About Current Cuts In AP, Pawan Kalyan Tweets About Current Cuts In The State

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకున్న విద్యుత్ కోతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు విద్యుత్ కోతల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, విద్యుత్ కోతలను ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన దసరా కానుకగా భావించాలా? అని ఘాటుగా ప్రశ్నించారు. సోమవారం నాడు రాష్ట్రంలో విద్యుత్ సమస్యపై వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పవన్ కళ్యాణ్ విద్యుత్ సమస్యపై ట్విట్టర్లో స్పందిస్తూ ‘ ఈ ఏడాది వర్షాలు భారీగా ఉన్నాయి. విద్యుత్ డిమాండ్ సహజంగానే తగ్గుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో సగటున రోజుకి 150 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని ముందుగానే విద్యుత్ రంగ నిపుణులు అంచనాలు వేశారు. ఆ మేరకు ఉత్పత్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు రాష్ట్రంలో సగటున రోజుకి 55 యూనిట్ల మేరకే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఆ ఫలితమే రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు. పల్లెల నుంచి నగరాల వరకూ అన్ని చోట్లా చీకట్లే. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దసరా కానుకగా భావించాలా?. 2018 సెప్టెంబర్ నెలలో 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినపుడు అందుకు తగ్గ విధంగా సరఫరా చేయగలిగిన ఎనర్జీ డిపార్ట్మెంట్ ఈసారి ఎందుకు విఫలమైంది? సర్కారు సన్నద్ధత లేకుండా మీనమేషాలు లెక్కించడంతో గత ఏడాది కంటే తక్కువ డిమాండ్ ఉన్నా ప్రజలు చీకట్ల పాలయ్యారు. ఏపీ జెన్కో థర్మల్ ఉత్పత్తి సామర్థ్యం గతం కంటే మెరుగైందని చెబుతారు తప్ప విద్యుత్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. 2019 సెప్టెంబర్ నెలలో విద్యుత్ డిమాండ్ 150 మిలియన్ యూనిట్స్. ఈ నెల 29 వ తేదీన థర్మల్, హైడల్, సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టులు నుంచి వచ్చిన విద్యుత్ 55 .315 మిలియన్ యూనిట్లు మాత్రమే’ అని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వ విధానాలపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, ఏ కొత్త ప్రభుత్వమైనా రాగానే చేసే మొదట పని శుభం తో మొదలుపెడతారు, కొత్త ప్రాజెక్టులు శంకుస్థాపనలు, పెట్టుబడుల మీద ఒప్పందాలు, కానీ వైసీపీ ప్రభుత్వం రాగానే చేసింది ఇళ్లు కూల్చివేతలు , పెట్టుబడుల ఒప్పందాల రద్దులు, భవననిర్మాణ కార్మికులకి పని లేకుండా చెయ్యటం, ఆశ వర్కర్ల ని రోడ్లు మీదకి తీసుకురావటం , కేసులు పెట్టటం, అమరావతి రాజధాని లేకుండా చెయ్యటం చేసారు. మరి ఇలాంటి ఆలోచనలతో ఉన్నవాళ్ళకి కరెంటు కొరత మీద ఏం దృష్టి ఉంటుంది? అని విమర్శించారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 18 =