ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ప్రొబేషన్ డిక్లరేషన్ జీవో విడుదల చేసిన ప్రభుత్వం

AP Govt Released GO Regarding Village and Ward Secretariat Employees Probation Declaration, Govt Released GO Regarding Village and Ward Secretariat Employees Probation Declaration, Village and Ward Secretariat Employees Probation Declaration, GO Regarding Village and Ward Secretariat Employees Probation Declaration, AP Govt Released GO Regarding Village Secretariat Employees Probation Declaration, AP Govt Released GO Regarding Ward Secretariat Employees Probation Declaration, New GO Regarding Village Secretariat Employees Probation Declaration, New GO Regarding Ward Secretariat Employees Probation Declaration, Village Secretariat Employees Probation Declaration, Ward Secretariat Employees Probation Declaration, Village and Ward Secretariat Employees Probation, AP Govt Released GO, Village and Ward Secretariat Employees, Village and Ward Secretariat Employees Probation News, Village and Ward Secretariat Employees Probation Latest News, Village and Ward Secretariat Employees Probation Latest Updates, Village and Ward Secretariat Employees Probation Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త వినిపించింది. శనివారం సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ జీవోను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబరు 5 ద్వారా కొద్దిసేపటి క్రితం ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులు నేటి నుంచి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించబడతారు. కాగా గతంలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాసయిన వారందరికీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగలందరికీ కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలను చెల్లించేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంచాయతీ సెక్రెటరీ, వార్డ్ సెక్రెటరీ లకు బేసిక్ పే రూ. 23,120 – రూ. 74,770 గా, ఇతర సచివాలయ ఉద్యోగులకు రూ. 22,460 – రూ. 72,810 గా ఖరారు చేసింది. ఈ మేరకు పెరిగిన జీతాలను ఆగస్టు 1న అందుకోనున్నారు. అయితే ఆత్మకూరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో దాదాపు నెలరోజుల పాటు ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ప్రక్రియ కొంచెం ఆలస్యం అయ్యిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. తమపై సానుకూల నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + eighteen =