జావెలిన్ త్రో ఫైనల్లోకి ప్రవేశించిన అన్ను రాణి

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, Annu Rani qualifies for Javelin Throw Final at World Athletics Championships, Annu Rani Qualifies For Javelin Throw Finals, Annu Rani qualifies for javelin throw finals with national record effort, latest sports news, latest sports news 2019, Mango News Telugu, sports news, World Athletics Championships

భారత మహిళా జావెలిన్ త్రో క్రీడాకారిణి అన్ను రాణి, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. జావెలిన్ త్రో లో అంచనాలకు మించి రాణించి తన పేరు మీదనే ఉన్న జాతీయ రికార్డును తిరగ రాసింది. సోమవారం నాడు దోహాలో జరిగిన హీట్స్ లో అన్ను రాణి జావెలిన్ ను 62.43 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచింది. గ్రూప్-ఏ లో క్వాలిఫికేషన్ రౌండ్ లోని తోలి రౌండ్ లో మొదట ప్రయత్నంలో జావెలిన్ ను 57.05 మీటర్లు విసిరింది. ఇక రెండో ప్రయత్నంలో 62.43 మీటర్లు విసిరి తన మీరు మీదనే గతంలో ఉన్న జాతీయ రికార్డు 62.34 మీటర్లు ను అధిగమించింది. ఈ రౌండ్ లో మొత్తం 31 మంది పాల్గొనగా అన్ను రాణి ఐదవ స్థానంలో నిలిచింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మహిళల జావెలిన్ త్రోలో ఫైనల్స్‌కు చేరుకున్న తొలి భారతీయ అథ్లెట్ గా అన్ను రాణి గుర్తింపు పొందింది. సోమవారం నాడు పోటీ పడిన మరో ఇద్దరు భారతీయ అథ్లెట్స్ అర్చన సుశీంద్రన్ 200 మీ పరుగు హీట్స్ లో చివరి స్థానములో నిలవగా, అంజలి దేవి 400 మీ పరుగు హీట్స్ లలో ఆరోవ స్థానంలో నిలిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =