తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో ఎమ్మెల్యే కి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధిలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. వైద్యుల సూచనల మేరకు ఎమ్మెల్యే ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్న వారు, కలిసిన వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సూచించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 22, మంగళవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,82,982 కి చేరింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ