తెలుగును అధికార భాషగా ఆమోదించిన పశ్చిమబెంగాల్ ప్రభుత్వం

West Bengal Govt Decides to Give Official Language Status to Telugu,West Bengal Government,Government Of Bengal Decides To Accept Telugu As The Official Language,Already Over 10 Official Languages,Telugu Language,Telugu,West Bengal Govt Decides To Give Telugu As Official Language Statuso,Cabinet Meeting,Telugu Status As The Official Language,West Bengal Elections 2021,West Bengal Cabinet Meeting,Mamata Banerjee,CM Mamata Banerjee,West Bengal Govt Decides To Give Telugu As State Official Language,West Bengal CM,Mango News,Mango News Telugu,West Bengal CM Mamata Banerjee,West Bengal,Official Language Status to Telugu

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగును అధికార భాషగా ఆమోదించింది. మంగళవారం నాడు జరిగిన పశ్చిమబెంగాల్ కేబినెట్ సమావేశంలో తెలుగుకు అధికార భాష హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే బెంగాల్‌లో ఉన్న తెలుగు ప్రజలను భాషాపరమైన మైనారిటీలుగా కూడా గుర్తిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమబెంగాల్‌లోని తెలుగు ప్రజలు చాలాకాలంగా తెలుగును అధికార భాషగా ఆమోదించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా బెంగాల్ లోని ఖరగ్‌పూర్‌ ప్రాంతంలో తెలుగువాళ్లు ఎక్కువుగా నివస్తున్నారు. ఖరగ్‌పూర్ ను మినీ ఆంధ్రగా పిలుస్తుంటారు. త్వరలో బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకే బెంగాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బెంగాల్ లో ఇప్పటికే 10కి పైగా భాషలను అధికార భాషలుగా ఆమోదం తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − four =