భూటాన్ లో 7 రోజుల పాటుగా పూర్తిస్థాయి సెకండ్ లాక్‌డౌన్

Bhutan Announces 7 Day Nationwide Lockdown From Today After New Corona Cases,Bhutan PM Announces 7 Day Nationwide Lockdown,Bhutan Enforces 7 Day Nationwide Lockdown From Today,Mango News,Mango News Telugu,Seven Day Nationwide Lockdown In Bhutan From Today,Bhutan Announces 7 Day Nationwide Lockdown,Bhutan Pm Announces 7 Day Nationwide Lockdown Amid New Covid-19 Cases,Covid-19,Bhutan Announces 1 Week Nationwide Lockdown,Bhutan Imposes 7 Day Nationwide Lockdown,Coronavirus News Live Updates,Coronavirus,Bhutan Enforces 7 Day Nationwide Lockdown,Bhutan Prime Minister Lotay Tshering,Lotay Tshering,Bhutan Announces 7 Day Nationwide Lockdown From Today,New Corona Cases

ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో యునైటెడ్ కింగ్ డమ్ సహా వివిధ దేశాల్లో మళ్ళీ లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి భూటాన్ దేశం కూడా చేరింది. భూటాన్ లో డిసెంబర్ 23, బుధవారం నుండి ఏడు రోజుల పాటుగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేయబడుతుందని ఆ దేశ ప్రధాని లోటే షెరింగ్ ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ముందుగా అంతర్-జిల్లా రాకపోకలపై పరిమితులు విధించారు. అయితే థింపు, పారో, లామోజింఖాలో పెద్ద సంఖ్యలో కొత్త కరోనా కేసులు పెరుగుతుండడంతో జాతీయ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ సూచనల మేరకు మళ్లీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మరియు సమాజంలో ఎంతవరకు వ్యాప్తి చెందుతుందో తెలుసుకోవడానికి ప్రభుత్వానికి వీలు కల్పిస్తుందని అన్నారు. లాక్‌డౌన్ సందర్భంగా అత్యవసర సేవలకు, జోన్స్ లో కేటాయించిన దుకాణాలకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, సంస్థలు, కార్యాలయాలు మరియు వ్యాపార సంస్థలు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు భూటాన్‌లో ఇప్పటి వరకు 482 మంది కరోనా బారినపడగా, వీరిలో ఇప్పటికే 435 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం 47 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ