నివర్ పరిహారం: కృష్ణాజిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వనున్న పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan to Submit Memorandum to Krishna Collector on Dec 28,Andhra Pradesh,Janasena Chief Pawan Kalyan To Give Memorandum to Krishna District Collector on Dec 28,Andhra Pradesh,Cyclone Nivar,Janasena Party,Krishna District,Pawan Kalyan,Mango News,Mango News Telugu,Janasena Chief Pawan Kalyan,Andhra Pradesh News,Janasena Chief Pawan Kalyan Latest News,Janasena Chief Pawan Kalyan To Give Memorandum To Krishna District,Krishna District,Pawan Kalyan News,Memorandum to Krishna Collector,Pawan Kalyan to Submit Memorandum to Krishna Collector,Pawan Kalyan to Submit Memorandum to Krishna Collector on Dec 28,Krishna Collector

నివర్ తుపాను బాధిత రైతులకు పరిహారం విషయంలో డిసెంబర్ 28న కృష్ణాజిల్లా కలెక్టర్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినతి పత్రం అందించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. “నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు 35 వేల రూపాయలు పరిహారంగా అందించాలని, తక్షణ సాయంగా పది వేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 28 వ తేదీన కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.ఎం.డి.ఇంతియాజ్ కు పవన్ కళ్యాణ్ వినతి పత్రం అందచేయనున్నారు. నేడు ప్రపంచ రైతుల దినోత్సవం సందర్భంగా రైతుల క్షేమాన్ని కాంక్షిస్తూ పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 28 వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి గుడివాడ, పెడన మీదుగా మచిలీపట్టణం చేరుకుంటారు. అనంతరం కలెక్టరేటులో కలెక్టర్ కు వినతి పత్రం అందచేస్తారు. రైతులు, కౌలు రైతుల ఉజ్వల భవిష్యత్తు కోసం జనసేన తలపెడుతున్న జైకిసాన్ కార్యక్రమంలో భాగంగా అదే రోజున రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాలలో జనసేన నాయకులు ఆయా జిల్లాల కలెక్టర్లకు నివర్ బాధిత రైతులు పక్షాన విజ్ఞాపన పత్రాలు సమర్పిస్తారు” అని జనసేన పార్టీ పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 9 =