ఆసియా కప్​ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాక్.. హెడ్ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్​కు కరోనా

Team India Cricket Head Coach Rahul Dravid Tested Positive For COVID-19 Ahead of Asia Cup, Rahul Dravid Tested Positive For COVID-19 Ahead of Asia Cup, Asia Cup 2022,. 2022 Asia Cup, Rahul Dravid, Team India Cricket Head Coach, Rahul Dravid Tests Positive for Covid-19, Positive for Covid-19, Coronavirus, Coronavirus LIVE Updates, Covid 19 Updates, COVID-19 Latest Updates, Positive For Coronavirus, Rahul Dravid Corona Positive, Rahul Dravid Coronavirus, Rahul Dravid Covid 19, Rahul Dravid Covid 19 Positive, Rahul Dravid Covid News, Rahul Dravid Covid Positive, Rahul Dravid Health, Rahul Dravid Health Condition, Mango News, Mango News Telugu,

ఆసియా కప్​ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాక్ తగిలింది. ఆ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్​కు కరోనా సోకింది. దీంతో కోచ్ ద్రవిడ్ లేకుండా ఆటగాళ్లు మంగళవారం యూఏఈకి వెళ్లనున్నారు. కాగా యూఏఈ వెళ్లే ముందు నిర్వహించిన పరీక్షల్లో కోచ్ ద్రవిడ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో రాహుల్ ఐసొలేషన్ లో ఉండనున్నారు. అయితే పాక్‌తో తొలి మ్యాచ్ ఆగస్టు 28 నాటికి ద్రవిడ్ కోలుకుని యూఏఈ వెళ్లే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇక వీవీఎస్ లక్ష్మణ్ తాజాగా జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా పనిచేసిన క్రమంలో రాహుల్‌ ద్రవిడ్ గైర్హాజరీలో ఆసియా కప్‌లోనూ కోచింగ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

ఆసియా కప్ ఆగష్టు 27 న ప్రారంభం కానుండగా.. రోహిత్ శర్మను కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్‌ను వైస్‌ కెప్టెన్‌గా 15 మంది సభ్యుల జట్టును ఆసియా కప్‌ కోసం బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే గాయాల వలన కీలక పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, హర్షల్‌ పటేల్ ఈ టోర్నీకి దూరమవడం టీమిండియాకు ఒకరకంగా సవాలే. వీరి స్థానంలో అక్షర్‌ పటేల్, దీపక్‌ చాహర్, శ్రేయస్‌ అయ్యర్‌లను జట్టులోకి తీసుకున్నారు. అలాగే విరాట్ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యా, దినేశ్‌ కార్తిక్‌ వంటి స్టార్ ఆటగాళ్ల రూపంలో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా గ్రూప్‌-బిలో పాకిస్థాన్‌తో పాటు క్వాలిఫైయర్‌లో ఉండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్-ఎలో ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + fifteen =