దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,432 కరోనా కేసులు, 252 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,24,303 కు, మరణాల సంఖ్య 1,48,153 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్స్ మరియు ఆసుపత్రుల్లో 2,68,581 మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు కొత్తగా 24,900 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 98,07,569 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 95.92 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.45 శాతంగా ఉంది.
ఇక డిసెంబర్ 28 నాటికీ దేశంలో 16,98,01,749 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 9,83,695 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. మరోవైపు కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో కేరళలో అత్యధికంగా 3047, ఆతర్వాత మహారాష్ట్రలో 2498, ఛత్తీస్ గడ్ లో 1188, వెస్ట్ బెంగాల్ లో 1028, తమిళనాడులో 1005, ఉత్తరప్రదేశ్ లో 940, మధ్యప్రదేశ్ లో 876 కేసులు నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ