విజయవాడ పర్యటనకు వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయకు సీఎం వైఎస్ జగన్ పుష్ప గుచ్చం అందించి, రాష్ట్ర ప్రభుత్వం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు విజయవాడలోని గేట్ వే హోటల్ లో గవర్నర్ బండారు దత్తాత్రేయను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా కలిశారు.
ముందుగా మంగళవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారిని గవర్నర్ దత్తాత్రేయ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ దత్తాత్రేయకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు గవర్నర్ కు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ







































