బ్రెజిల్ కు 20 ల‌క్ష‌ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిన భార‌త్‌, ధ‌న్యవాదాలు తెలిపిన బోల్సోనారో

Corona Vaccination, Corona Vaccination Drive, Corona Vaccine In India, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Distribution For Covid-19 Vaccine, India sends 2 Million Corona Vaccine Doses to Brazil, Mango News, Vaccine Distribution

పొరుగు దేశాలు మరియు ముఖ్య భాగస్వామ్య దేశాలకు దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా దేశంలో త‌యారైన 20 లక్షల కోవీషీల్డ్ కరోనా వ్యాక్సిన్ డోసులను భారత్ బ్రెజిల్ దేశానికి పంపించింది. ఈ సందర్భంగా బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్‌ బోల్సోనారో స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రపంచ అడ్డంకిగా మారిన కరోనా మహమ్మారిని అధిగమించడానికి చేసే ప్రయత్నాల్లో భారత్ లాంటి గొప్ప భాగస్వామిని కలిగి ఉండటం బ్రెజిల్ గౌరవంగా భావిస్తుందని చెప్పారు.

బ్రెజిల్ కు కరోనా వ్యాక్సిన్ పంపటాన్ని హనుమంతుడు సంజీవని తీసుకురావడంతో పోలుస్తూ ఫోటో షేర్ చేశారు. భారత్ నుండి బ్రెజిల్‌కు కరోనా వ్యాక్సిన్ల ఎగుమతులకు సహకరించినందుకు ధన్యవాదాలు చెప్పారు. అనంతరం ప్రధాని మోదీ స్పందిస్తూ, కరోనా మహమ్మారిపై కలిసి పోరాడడంలో బ్రెజిల్ యొక్క విశ్వసనీయ భాగస్వామిగా ఉండడం గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు తెలిపారు. ఆరోగ్య సంరక్షణపై భారత్ సహకారాన్ని బలోపేతం చేస్తూనే ఉంటామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ