కొత్త సచివాలయంలో గుడి, మసీదు, చర్చిలను ప్రభుత్వమే నిర్మిస్తుంది

Mango News, Masjid and Temple in Secretariat, Secretariat Employees, Secretariat Employees Over Masjid and Temple in Secretariat, Telangana Ministers, Telangana Ministers Meeting with Secretariat Employees, Telangana New Secretariat, Telangana New Secretariat Building, Telangana New Secretariat Construction, telangana secretariat

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గొప్ప లౌకికవాది, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు చెప్పారు. కొత్త సచివాలయంలో ప్రార్థనా మందిరాలను నిర్మించే విషయమై మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన సెక్రటేరియట్ లో బుధవారం నాడు సమావేశం జరిగింది. హోం మంత్రి, పశుసంవర్ధక శాఖల మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి మంత్రి కొప్పుల ముస్లిం మత ప్రతినిధులు, క్రిస్టియన్, హిందూ మతాల ప్రతినిధులు, సెక్రటేరియట్ ఉద్యోగులతో చర్చించారు.

కొత్త సచివాలయంలో గుడి, మసీదు, చర్చిలను ప్రభుత్వమే నిర్మిస్తుంది:

కొత్తగా కడుతున్న సచివాలయంలో గుడి, మసీదు, చర్చిల నిర్మాణ ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రులు తెలిపారు. సచివాలయంతో పాటు ప్రార్థనా మందిరాలు కూడా సకాలంలో పూర్తవుతాయని మంత్రులు స్పష్టం చేశారు. ఇందులో ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు హామీనిచ్చారు. సీఎం కేసీఆర్ నిబద్ధత, అంకితభావం పట్ల తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ప్రార్ధనా మందిరాలను సకాలంలో నిర్మిస్తారన్న నమ్మకంతో ఉన్నామని మూడు మతాల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ