అయోమయంలో ఓటర్లు.. అభ్యర్థులలో టెన్షన్

How was the mood of the Munugode voters,mood of the Munugode voters,How was the mood of voters,The Elusive Mind Of Voters,Munugode Assembly Constituency, Komatireddy Raj Gopal Reddy , Chalamala Krishna Reddy,Mango News,Mango News Telugu,Kusukuntla Prabhakar Reddy , Palvai Sravanthi Reddy,Assembly Elections 2023 highlights,Telangana Politics,Telangana Assembly polls,Telangana Elections 2023,Munugode Assembly Constituency Latest News,Munugode Assembly Constituency Latest Updates,Munugode Assembly Constituency Live News,Munugode voters News Today,Munugode voters Latest News
The Elusive Mind Of Voters , Munugode Assembly Constituency, Komatireddy Raj Gopal Reddy , Chalamala Krishna Reddy , Kusukuntla Prabhakar Reddy , Palvai Sravanthi Reddy

మునుగోడు నియోజకవర్గంలో ఓటర్లు ఎటు ఉన్నారో..  ఎవరికి పట్టం కడతారో అభ్యర్థులకు అర్ధం కాని పరిస్థితి తలెత్తింది. గత ఎన్నికలలో ఉన్న నేతలు పార్టీలు మారడంతో ఏ ఓటరు ఎటు చూస్తున్నాడో తెలియని సిచ్యువేషన్ అక్కడ ఉంది. కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి రాజీనామాతో.. మునుగోడులో వచ్చిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా రాజగోపాల్ రెడ్డి పోటీ చేయగా,కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, బీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీకి దిగారు.

దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన మునుగోడు బై ఎలక్షన్స్‌లో.. బీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల కేవలం కొద్ది ఓట్ల మెజారీటీతో విజయం సాధించారు.  అయితే ఆ తర్వాత కేవలం 15 నెలల్లోనే వచ్చిన ఈ  ఎన్నికలలో తిరిగి కూసుకుంట్ల  బీఆర్ఎస్ అభ్యర్ధిగా టికెట్ దక్కించుకోగా, బీజేపీకి బై బై చెప్పిన కోమటిరెడ్డి.. కాంగ్రెస్ నుంచి పోటీలో ఉండగా, కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన చలమల్ల కృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్ధిగా పోటీలో నిలిచారు.

మరో కాంగ్రెస్ మహిళా నేత,ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా నిలబడ్డ పాల్వాయి స్రవంతి రెడ్డి.. కాంగ్రెస్‌లో రగిలిన అసమ్మతితో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఇక ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైఖరి నచ్చని స్థానిక ప్రజా ప్రతినిధులు మూకుమ్మడిగా కారు దిగి హస్తం గూటికి చేరి పోయారు. మరోవైపు బీజేపీ అభ్యర్ధిగా మారిన కాంగ్రెస్ నేత చల్లమల కృష్ణారెడ్డి.. ఎప్పటి నుంచో ఉంటున్న బీజేపీ నేతలను పట్టించుకోవడంలేదని.. ఆ నేతలంతా అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మనుగోడులో ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నేతల మధ్యే ఇలా ఉంటే  ఇక ఓటర్లు ఎలా తీర్పు ఇస్తారో అన్న ప్రశ్నలు  వినిపిస్తున్నాయి. పార్టీని నమ్మి, అభ్యర్థిని నమ్మి ఓటేస్తే గెలిచాక అతను  ఏ పార్టీ కండువా కప్పుకుంటాడో అన్న అనుమానాలను ఓటర్లు వ్యక్త పరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య జరుగుతున్న పోలింగ్‌లో   ఓటర్లు ఎలా నిర్ణయం తీసుకుని ఎవరికి ఓటేస్తున్నారా అని పార్టీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయటకు ఎవరికి వారు తమ వైపే ఓటర్లంతా ఉన్నారని చెబుతున్నా.. మునుగోడు తాజా రాజకీయ పరిస్థితుల మధ్య  ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు గతంలో  ఒక పార్టీ అభ్యర్ధిగా ఒక గుర్తు మీద పోటీ చేసిన నేతకు .. ఇప్పుడు పార్టీ గుర్తు మారడంతో.. ఫలానా గుర్తుకు ఓటేయాలని అప్పుడు ప్రచారం చేసినవారే.. ఇప్పుడు ఆ గుర్తుకు ఓటేయకండి  కొత్త గుర్తుకు  ఓటేయాలని  ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతో  ఏ గుర్తుఎవరిదో?ఎవరొచ్చి ఏ గుర్తుకు ఓటేయమని చెప్పారో గుర్తు లేక..ఆ  తికమకతోనే ఓటేస్తున్నారు. ఇలాంటి కన్ఫ్యూజన్ల మధ్య నేతల తలరాత మారిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదన్న వాదన వినిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 16 =