పీఎం-కిసాన్‌ పథకం ద్వారా ఇప్పటికి రూ.1.15 లక్షల కోట్లు రైతులకు బదిలీ

Mango News, Modi government PM-KISAN scheme, PM KISAN completes two years today, PM Kisan Samman Nidhi installment, PM Kisan Samman Nidhi Yojana, PM Kisan Scheme, PM KISAN Scheme News, PM Kisan Scheme Second Installment, PM KISAN Scheme Status, PM KISAN Scheme Updates, Pradhan Mantri Kisan Samman Nidhi

దేశంలో రైతుల కోసం కేంద్రప్రభుత్వం “పీఎం-కిసాన్”‌ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రూ.1.15 లక్షల (1,15,638.87) కోట్లును 10.75 కోట్లకుపైగా లబ్ధిదారు రైతుల ఖాతాలకు బదిలీ చేసినట్టు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. వ్యవసాయరంగంలో ఈ పథకాన్ని ఒక మైలురాయిగా భవిష్యత్ తరాలు గుర్తుంచుకుంటాయని ఆయన పేర్కొన్నారు. పీఎం-కిసాన్ పథకం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పథకం అమలులో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు మరియు జిల్లాలకు మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అవార్డులు ప్రదానం చేశారు.

అలాగే కరోనా కాలంలో రైతులు చేసిన కృషిని మంత్రి గుర్తు ప్రశంసించారు. ప్రతికూల పరిస్థితులతో సంబంధం లేకుండా రైతుల కృషి వల్ల దేశం ఏ సంక్షోభం నుంచి అయినా తప్పించుకునే అవకాశం ఉందని అన్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి పలువిభాగాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని రెండు జిల్లాలు కూడా పీఎం–కిసాన్‌ అవార్డులు గెలుచుకున్నాయి. పీఎం-కిసాన్ అమలులో భౌతిక పరిశీలన విభాగంలో అనంతపురం, వివాదాల పరిష్కారాల విభాగంలో నెల్లూరు జిల్లాలు అవార్డులు దక్కించుకున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ