ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ కు రంగం సిద్ధం, నేడే ఘనంగా ప్రారంభం

Women’S Premier League-2023 Starts From Today First Match Between Gujarat Giants And Mumbai Indians,Women’S Premier League-2023,Women’S Premier League Today,Women’S Premier League First Match,WPL Gujarat Giants And Mumbai Indians,Mango News,Mango News Telugu,WPL 2023,Women'S Premier League Opener,Gujarat Giants Vs Mumbai Indians WPL,Women IPL 4 March Match 2023,WPL 2023 Live Streaming,WPL Kickstarts Today

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2023/మొదటి సీజన్ కు రంగం సిద్ధమైంది. ఈ చారిత్రాత్మక డబ్ల్యూపీఎల్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న డబ్ల్యూపీఎల్ మరికొద్ది గంటల్లో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ రోజు (మార్చి 4, శనివారం) రాత్రి 8.00 గంటలకు నావీ ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్ మరియు ముంబయి ఇండియన్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్ తో డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్ ప్రారంభం కానుంది. రాత్రి 07.30 గంటలకు టాస్ జరుగుతుంది. డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ వంటి 5 ఫ్రాంచైజీలు పాల్గొంటున్న విషయం తెలిసిందే.

డబ్ల్యూపీఎల్ ప్రారంభ వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం 4.00 గంటలకే అభిమానుల కోసం డివై పాటిల్ స్టేడియం గేట్లు తెరిచారు. సాయంత్రం 6:25 గంటలకు గ్రాండ్ ఓపెనింగ్ వేడుక ప్రారంభం కానుండగా, బాలీవుడ్ తారలు కియారా అద్వానీ, కృతి సనన్ నృత్య ప్రదర్శనలు మరియు పలువురు ప్రముఖుల కళా ప్రదర్శనలు జరగనున్నాయి. అలాగే గాయకుడు-గేయరచయిత ఏపీ ధిల్లాన్ తన సంగీత చార్ట్‌బస్టర్‌లలో కొన్నింటిని వేదికపై ప్రదర్శించనున్నారు.

డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్‌ మొత్తం 23 రోజుల వ్యవధిలో, మార్చి 4 నుండి 26 వరకు ముంబయిలో జరగనుంది. 20 లీగ్ మ్యాచ్‌లు మరియు 2 ప్లేఆఫ్ గేమ్‌లను నిర్వహించనున్నారు. మొత్తం 22 మ్యాచ్‌లు కూడా ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం (11 మ్యాచులు) మరియు డీవై పాటిల్ స్టేడియం (11 మ్యాచులు) లోనే జరగనున్నాయి. నేడు తోలి మ్యాచ్ జరుగుతుండగా, మార్చి 24న డీవై పాటిల్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ఇక డబ్ల్యూపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ మార్చి 26న బ్రబౌర్న్ స్టేడియంలో నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం డబ్ల్యూపీఎల్ మ్యాచులు మధ్యాహ్నం 3:30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు జరగనున్నాయి.

ముందుగా డబ్ల్యూపీఎల్-2023 వేలంలో 5 ఫ్రాంచైజీలు కలిపి 87 మంది క్రికెటర్లను కొనుగోలు చేశాయి. వీరిలో 57 మంది భారత్ ఉమెన్ క్రికెటర్లు కాగా, 30 మంది విదేశీ ఉమెన్ క్రికెటర్లు ఉన్నారు. భారత ఉమెన్స్ క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ, భారత అండర్19 ప్రపంచ కప్ విజేత జట్టు కెప్టెన్ షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ సహా పలువురు భారత ప్లేయర్స్, మెగ్ లానింగ్, అలిస్సా హీలీ, బెత్ మూనీ, డియాండ్రా డాటిన్, ఎల్లీస్ పెర్రీ, సోఫీ ఎక్లెస్టోన్, సోఫీ డివైన్ సహా పలువురు విదేశీ స్టార్ ప్లేయర్స్ కూడా డబ్ల్యూపీఎల్ లో పాల్గొంటున్నారు. డబ్ల్యూపీఎల్ విజయవంతంపై మంచి అంచనాలు నెలకొనగా, మొదటి సీజన్ ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో, ఏ జట్టు టైటిల్ గెలుచుకుంటుందో వేచి చూడాలి.

డబ్ల్యూపీఎల్-2023 వివరాలు:‌

  • ప్రారంభ తేదీ – మార్చి 4
  • ఫైనల్స్ – మార్చి 26
  • మ్యాచుల సమయాలు: మధ్యాహ్నం గం.3.30, రాత్రి గం.7.30
  • వేదిక: ముంబయి (డీవై పాటిల్ స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియం)

డబ్ల్యూపీఎల్-2023 కెప్టెన్స్:

  • ముంబయి ఇండియన్స్ – హర్మన్‌ ప్రీత్ కౌర్
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – స్మృతి మంధాన
  • ఢిల్లీ క్యాపిటల్స్ – మెగ్ లానింగ్
  • గుజరాత్ జెయింట్స్ – బెత్ మూనీ
  • యూపీ వారియర్స్ – అలిస్సా హీలీ.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here