సచివాలయాల్లో 8402 పోస్టుల ఖాళీలు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాం: మంత్రి పెద్దిరెడ్డి

Andhra Pradesh Grama/Ward Sachivalayam, AP Grama Sachivalayam Exam, AP Grama Sachivalayam Posts Recruitment, AP Minister Peddireddy, AP Minister Peddireddy Ramachandra Reddy, AP Village Ward Secretariat Vacancies, AP Ward Secretary Notification, APPSC Grama Sachivalayam Recruitment, APPSC Grama Sachivalayam Recruitment 2021, Mango News, Village, Village Ward Secretariat Vacancies, Village Ward Secretariat Vacancies will Recruit through APPSC

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామా, వార్డు సచివాలయాల్లో 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం నాడు సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఖాళీగా ఉన్న సచివాలయ ఉద్యోగాల భర్తీ పక్రియను ఈసారి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ద్వారా చేపట్టనున్నట్టు తెలిపారు. మొత్తం ఖాళీల వివరాలను ఏపీపీఎస్సీకి పంపి క్యాలెండర్‌ కు అనుగుణంగా భర్తీ చేయనున్నట్టు చెప్పారు. మరోవైపు ఇటీవల నాలుగు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎంపికైన సర్పంచ్ లకు శిక్షణ ఇవ్వడంతో పాటుగా, ఎంపీడీవోల పదోన్నతులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ