ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Pawan Kalyan Cast his vote

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 12 కార్పొరేషన్లకు మరియు 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్స్/ మున్సిపాలిటీల పరిధిలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొమ్మ సీతారామయ్య జెడ్పీ బాలికల హైస్కూల్, పటమట లంకలోని పోలింగ్ బూత్ లో పవన్ కళ్యాణ్ ఓటు వేశారు. పవన్ కళ్యాణ్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న సమయంలో అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి సందడి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ