ఏపీలో 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో పోలింగ్ ప్రారంభం

2021 AP Municipal Elections, Andhra Pradesh Municipal Corporation, Andhra Pradesh Municipal Corporation elections, Andhra Pradesh Municipal elections, Andhra Pradesh Municipal Elections 2021 news and live updates, Andhra Pradesh Municipal Polls, AP Municipal Corporation Elections, AP Municipal Elections, AP Municipal Elections 2021, AP Municipal Elections 2021 LIVE, AP Municipal Elections 2021 News, Ap Municipal Elections Campaign, AP Municipal Elections News, AP Municipal Elections Polling, AP Municipal Elections Polling Underway, AP Municipal Elections Polling Underway Across the State, AP Municipal Polls, AP Municipal Polls 2021, Mango News, Municipal Elections

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం నుంచే ప్రజలు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 12 కార్పొరేషన్లలో మరియు 13 జిల్లాల్లోని 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణ కోసం 7,915 పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు.

ముందుగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల అవగా 4 మున్సిపాలిటీలు ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్ఆర్ కడప‌ జిల్లాలోని పులివెందుల, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలిటీల్లో అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో నేడు 71 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవమైన డివిజన్స్/వార్డులు మినహాయించి ఈ రోజు 2,214 డివిజన్స్/వార్డుల్లో పోలింగ్ జరుగుతుండగా, 7,549 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఇక ఈ ఎన్నికల్లో 77,73,231 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల నిర్వహణలో మొత్తం 48,723 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే మార్చి 13 వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. మార్చి 14 వ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =