ఏపీకి 3 రాజధానులపై వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది, శాసనరాజధాని మాత్రం అమరావతిలోనే – సజ్జల రామకృష్ణారెడ్డి

Ap Govt Advisor Sajjala Ramakrishna Reddy Interesting Comments On Amaravati Capital,Ycp Government Committed To 3 Capitals For Ap, Legislative Capital Is Amaravati,Sajjala Ramakrishna Reddy,Ap Govt Advisor Sajjala Ramakrishna Reddy,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులపై వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే శాసనరాజధాని మాత్రం అమరావతిలోనే ఉంటుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి 3 రాజధానుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసమేనని, దీనికి అనుగుణంగానే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని పేర్కొన్నారు. మూడు రాజధానుల విషయంలో హైకోర్టులో భిన్నమైన తీర్పులు వచ్చాయని, అయితే ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకరించడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని సుప్రీం కూడా స్పష్టం చేసిందని సజ్జల అన్నారు.

ఇక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి చట్టం కూడా మద్దతిస్తోందని,. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్రలను ప్రజలతో పాటు కోర్టులు కూడా గుర్తించాయని సజ్జల అన్నారు. రాజధానిని ఒకే చోట నిర్మించాలని చెప్పిన హైకోర్టు మాట సరికాదని, దాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టి ప్రశ్నించిందని గుర్తు చేశారు. సుప్రీం తీర్పుపై టీడీపీ ఎందుకు మౌనంగా ఉందని, చంద్రబాబు ఎందుకు సపండించడం లేదని ప్రశ్నించారు. కాగా అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలంటే దాదాపు రూ.లక్ష కోట్లు కావాలని, అంత పెద్ద మొత్తం ఒకేచోట ఖర్చు చేసే బదులు మూడు ప్రాంతాల అభివృద్ధికి వినియోగించడం మేలని చెప్పారు. త్వరలోనే 3 రాజధానులపై కొత్త బిల్లు తీసుకొస్తామని, గతంలో తెచ్చిన బిల్లుని ప్రభుత్వం ఉపసంహరించుకుందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − fourteen =