కాంగ్రెస్‌కు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా?

Former MP Konda Vishweshwar Reddy Says He will Distance himself from Congress for 3 Months

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. చేవెళ్ల మాజీ ఎంపీ, టి-కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ వీడతారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఖండిస్తూ వస్తున్నారు. అయితే రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే తానూ కాంగ్రెస్ పార్టీకి 3 నెలల పాటుగా దూరంగా ఉంటానని కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 3 నెలల అనంతరం రాజకీయాలపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తన అనుచరులకు సమాచారమిచ్చినట్టు తెలుస్తుంది.

మరోవైపు ఆయన బీజేపీ పార్టీలో చేరబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా కాంగ్రెస్ పార్టీకి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా అంశంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ముందుగా టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన 2014 లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే 2018లో పార్టీలో విభేదాల కారణంతో టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌ లో చేరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ