ఆర్‌ఆర్‌ఆర్‌ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు సాధించడంపై సంతోషం వ్యక్తం చేసిన చిరంజీవి, పవన్ కళ్యాణ్

Megastar Chiranjeevi Janasena Chief Pawan Kalyan Expressed Happiness over RRR's Natu Natu Song Wins Oscar Award,Megastar Chiranjeevi Expressed Happiness over RRR,Janasena Chief Pawan Kalyan over RRR,RRR's Natu Natu Song Wins Oscar Award,Mango News,Mango News Telugu,Political Cine Celebrities Extends Congratulates,Telugu Film News 2023,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Movie Latest News,RRR Movie Songs,RRR Naatu Naatu Song,RRR Naatu Naatu,Naatu Naatu Song,Naatu Naatu,Naatu Naatu Video Song,Oscars,Oscars 2023,RRR Oscars 2023,RRR Naatu Naatu Song Oscars 2023,Naatu Naatu Full Video Song,Oscars 95,95th Academy Awards,Academy Awards,Global Star Ram Charan,RRR at OSCARS,Man Of Masses Ram Charan,SS Rajamouli,Ram Charan,Ram Charan Movies,Jr NTR,Jr NTR Movies,MM Keeravani,Lyricist Chandra Bose,Oscars 2023 Live Updates,Oscars 2023 Highlights

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌‘ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడం పట్ల ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ, “నాటు నాటు ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్ అవార్డును దక్కించుకుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ సభ్యులైన దర్శకుడు రాజమౌళి, ఎంఎం కీరవాణి, చంద్రబోస్, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్, తారక్, రామ్ చరణ్ లకు అభినందనలు. ఆస్కార్‌ అవార్డులు అనేవి భారతదేశానికి ఇప్పటికీ ఒక కలగా ఉండేవి, కానీ రాజమౌళి అనే ఒక వ్యక్తి యొక్క విజన్, ధైర్యం మరియు దృఢవిశ్వాసం దాన్ని నిజం చేసింది. కోట్లాది భారతీయుల హృదయాలు గర్వం, సంతోషంతో నిండిపోయాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం యొక్క బ్రిలియంట్ టీమ్‌లోని ప్రతి సభ్యునికి అభినందనలు” అని చిరంజీవి పేర్కొన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలవడండంతో భారతీయులంతా గర్విస్తున్న క్షణాలివి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. “ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై పురస్కారాన్ని స్వీకరించిన ఆర్.ఆర్.ఆర్ చిత్ర సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణికి, గీత రచయిత చంద్రబోస్ కి హృదయపూర్వక అభినందనలు. ఈ వార్తను చూడగానే ఎంతో సంతోషించాను. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నిలిచిన ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో ‘నాటు నాటు’ గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించింది. ఆ హుషారు ఈ రోజు ఆస్కార్ వేదిక మీద రెట్టించిన ఉత్సాహంతో కనిపించింది. ఈ వేదికపై ఈ గీతాన్ని ప్రదర్శించడంతో పాటు అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరింది. ఇంతటి ఘనత పొందేలా ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని రూపొందించిన దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళికి ప్రత్యేక అభినందనలు. ఆ చిత్రంలో కథానాయక పాత్రల్లో ఒదిగిపోయిన ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నృత్య దర్శకులు ప్రేమ్ రక్షిత్, చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్యలకు అభినందనలు. ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి దక్కిన ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుతో పాటుగా పలు అంతర్జాతీయ పురస్కారాలు భారతీయ దర్శకులు, నటులు, రచయితలకు స్ఫూర్తినిస్తుంది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + eleven =