ఏపీలో 11 కార్పొరేషన్లకు మరియు 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో గురువారం నాడు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, చైర్ పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. ముందుగా అన్ని ప్రాంతాల్లో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కార్పొరేటర్లుగా గెలుపొందిన వారు ఆయా కార్పొరేషన్స్ లో మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. అలాగే వార్డు సభ్యులుగా విజయం సాధించిన వారు మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్, వైస్ చైర్‌పర్సన్ లను ఎన్నుకున్నారు.
కాగా ఈసారి కార్పొరేషన్స్ లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల్లో ఇద్దరు వైస్ చైర్‌పర్సన్లను ఎన్నుకునే విధంగా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తుంది. ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్, ఒక వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక జరగగా, మరో డిప్యూటీ మేయర్, మరో వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనుంది. 11 కార్పొరేషన్స్, 74 మున్సిపాలిటీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, వైస్ చైర్‌పర్సన్ లుగా ఎన్నికయ్యారు. ఇక తాడిపత్రిలో టీడీపీ పార్టీ అభ్యర్థులు చైర్ పర్సన్, వైస్ చైర్‌పర్సన్ గా ఎన్నికయ్యారు.
11 కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైన వారు వీరే:
1.గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ):
- మేయర్ : గొలగాని హరి వెంకటకుమారి
- డిప్యూటీ మేయర్‌గా జియ్యాని శ్రీధర్
2.విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్:
- మేయర్: భాగ్యలక్ష్మీ
- డిప్యూటీ మేయర్ : బెల్లం దుర్గ
3.గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్:
- మేయర్ : కావటి మనోహర్‌నాయుడు
- డిప్యూటీ మేయర్ : వనమా బాలవజ్ర బాబు
4.విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్:
- మేయర్: విజయలక్ష్మి
- డిప్యూటీ మేయర్ : ముచ్చు నాగలక్ష్మి
5.చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్:
- మేయర్ : అముద
- డిప్యూటీ మేయర్ : చంద్రశేఖర్
6.అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్:
- మేయర్ : మహ్మద్ వసీమ్ సలీమ్
- డిప్యూటీ మేయర్ : వాసంతి సాహిత్య
7.ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్:
- మేయర్ : గంగాడి సుజాత
- డిప్యూటీ మేయర్ : వేమూరి సూర్యనారాయణ
8.కడప మున్సిపల్ కార్పొరేషన్:
- మేయర్ : సురేష్‌బాబు
- డిప్యూటీ మేయర్ : షేక్ ముంతాజ్ బేగం
9.మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్:
- మేయర్ : మోకా వెంకటేశ్వరమ్మ
10.తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్:
- మేయర్ : డా.శిరీషా
11.కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్:
- మేయర్: బీవై రామయ్య
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ