సింహాద్రి రమేష్‌కు మచిలీపట్నం వైసీపీ ఎంపీ టికెట్?

machilipatnam, ycp mp ticket, simhadri ramesh babu, CM jagan
machilipatnam, ycp mp ticket, simhadri ramesh babu, CM jagan

మిగతా పార్టీలకంటే ముందే తమ గెలుపు గుర్రాలను కదనరంగంలోకి దింపుతున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే నాలుగు విడతలుగా తమ అభ్యర్థులను ప్రకటించారు. రేపో, మాపో అయిదో జాబితాను కూడా ప్రకటించనున్నారు. ఆ వెంటనే తుది జాబితాను కూడా విడుదల చేసేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈక్రమంలో మచిలీపట్నం లోక్ సభ స్థానానికి జగన్ అభ్యర్థిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలో విడుదలయ్యే అయిదో జాబితాలో అతని పేరు ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా వల్లభనేని బాలశౌరి ఉండగా.. ఆయన ఇటీవలే వైసీపీకీ రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో బాలశౌరికి జగన్ టికెట్ నిరాకరించారు. నియోజకవర్గంలో ఆయనకు ప్రజాదరణ తగ్గిపోవడంతో పాటు.. సర్వేలు కూడా బాలశౌరిపై తీవ్ర వ్యతిరేకత ఉందని తేల్చేశాయి. ఈసారి ఆయనకు టికెట్ ఇచ్చినా ఓటమి ఖాయమని తేల్చాయి. దీంతో వైసీపీ హైకమాండ్ బాలశౌరికి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. టికెట్ కోసం బాలశౌరి గట్టిగానే ప్రయత్నించినప్పటికీ.. ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన వైసీసీకి గుడ్ బై చెప్పేశారు. జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

ఈక్రమంలో బాలశౌరి స్థానంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు జగన్ కసరత్తు చేశారు. పలువరి పేర్లను పరిశీలించారు చివరికి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేరును ఖరారు చేశారట. ప్రస్తుతం రమేష్ కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2019లో వైసీపీ తరుపున అవనిగడ్డ నుంచి సింహాద్రి రమేష్ బాబు పోటీ చేసి ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి మండలి ముద్ధ ప్రసాద్‌పై 20 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు కృష్ణా జిల్లాపై మంచి పట్టు ఉంది. ప్రజాబలం కూడా ఎక్కువగానే ఉంది.

ఈక్రమంలో సింహాద్రి రమేష్‌ను మచిలీపట్నం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపాలని జగన్ ఆలోచిస్తున్నారట. ఇప్పటికే రమేష్‌తో వైసీపీ పెద్దలు ఈ విషయం గురించి మాట్లాడారట. అటు రమేష్ కూడా మచిలీపట్నం నుంచి లోక్‌సభకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సింహాద్రి రమేష్ కూడా అధినేత జగన్ తనను ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఆయన గీసిన గీతను దాటబోనని స్పష్టం చేశారు. ఈక్రమంలో మచిలీపట్నం వైసీపీ ఎంపీ టికెట్ సింహాద్రి రమేష్‌కు ఖరారయినట్లేనని జోరుగా ప్రచారం జరుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + eighteen =