ఏపీ అసెంబ్లీలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

3 TDP MLAs Suspended For Disrupting Vidhan Sabha Proceedings, 3 TDP MLAs suspended from Andhra Assembly for obstructing proceedings, Andhra Pradesh Assembly Sessions Live Updates, Andhra Pradesh Latest News, AP Assembly Live Updates, Ap Political News, Mango News, Three TDP MLAs Suspended from Andhra Assembly, Three TDP MLAs Suspended From AP Assembly

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి, మంగళవారం నాడు సభ మొదలైన కొద్దిసేపటికే వాదనలు మొదలయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరియు మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్స్ కల్పించే బిల్లుకు అడ్డుపడుతున్నారని ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తునట్టు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రకటించారు. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ను ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించారు.

సస్పెన్షన్ అయినవారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు అనగా ఈనెల 30 వరకు వీరిపై సస్పెన్షన్ కొనసాగుతుంది. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సస్పెండ్ చేస్తునట్టు ప్రకటించినప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని వీడకుండా అక్కడే ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. కొంత సేపు గందరగోళ పరిస్థితుల మధ్యనే సభ కొనసాగింది, ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సభ సంప్రదాయాలను గౌరవించని సభ్యులని, కొంత కాలమే కాకుండా శాశ్వతంగా బహిష్కరించాలని స్పీకర్ ను డిమాండ్ చేసారు.

 

[subscribe]
[youtube_video videoid=B7RfYjojlhY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =