ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు: నాలుగో రౌండ్ రౌండ్ లో కూడా ఆధిక్యంలో నిలిచిన పల్లా

Mango News, Telangana Graduates MLC Elections, Telangana Graduates MLC Elections Counting, Telangana Graduates MLC Elections Counting Process, Telangana Graduates MLC Elections Counting Process Start, Telangana Graduates MLC Elections Counting Process Start Tomorrow, Telangana Graduates MLC Elections Votes Counting, Telangana MLC Elections, Telangana MLC Elections 2021, Telangana MLC Elections 2021 Results, Telangana MLC Elections Counting, Telangana MLC Elections Results

తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్గొండలో ఆర్జాలబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి జరుగుతుంది. ఓక్కో రౌండ్‌లో 56,000 ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు. మొత్తం ఏడు రౌండ్ల లెక్కింపు నిర్వహించనున్నారు. కాగా రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ప్రస్తుతానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు.

ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ స్థానం నాలుగో రౌండ్ కౌంటింగ్ వివరాలు:

నాలుగో రౌండ్‌ లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి 15897 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 12146, ప్రొఫెసర్ కోదండరామ్ ‌కు 10048,, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి కి 5099, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్ ‌కు 4003 ఓట్లు పోల్ అయ్యాయి. నాలుగో రౌండ్‌లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 3751 ఓట్ల ఆధిక్యం రాగా, మొత్తం నాలుగు రౌండ్ల కౌంటింగ్ అనంతరం ఆయన సమీప అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న కంటే 15438 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ స్థానం మూడో రౌండ్ కౌంటింగ్ వివరాలు:

మూడో రౌండ్‌ లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి 15558 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 11742, ప్రొఫెసర్ కోదండరామ్ ‌కు 11039, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి కి 5320, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్ ‌కు 4333 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్‌లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 3,816 ఓట్ల ఆధిక్యం రాగా, మొత్తం మూడు రౌండ్ల కౌంటింగ్ అనంతరం ఆయన సమీప అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న కంటే 11,687 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ స్థానం రెండో రౌండ్ కౌంటింగ్ వివరాలు:

రెండో రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 15,857 ఓట్లు సాధించారు. సమీప ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నపై 3,787 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న 12,070 ఓట్లు సాధించగా, ప్రొఫెసర్ కోదండరామ్‌కు 9,448, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 6,669, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 3,244 ఓట్లు వచ్చాయి. రెండు రౌండ్ ల అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి సమీప అభ్యర్థి కంటే 7871 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ స్థానం తొలి రౌండ్ కౌంటింగ్ వివరాలు:

తొలి రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 16130 ఓట్లతో తొలిస్థానంలో నిలిచారు. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న 12,046 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌కు 9,080, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి కి 6,615, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్ ‌కు 4,354 ఓట్లు వచ్చాయి.

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం తొలి రౌండ్ కౌంటింగ్ వివరాలు:

తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి 17,439 ఓట్లు లభించాయి. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 16,385 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 8,357 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి జి.చిన్నారెడ్డికి 5,082 ఓట్లు లభించాయి. తొలి రౌండ్ లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి సమీప బీజేపీ అభ్యర్థిపై 1044 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో మార్చి 14న పోలింగ్ జరగగా, ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానంలో 3,86,320 మంది ఓటర్లు, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో 3,57,354 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకున్నారు. ఈ రెండు స్థానాలకు కలిపి మొత్తం 164 మంది అభ్యర్థులు బరిలో నిలవడం, ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా ఫలితాలు ప్రకటించాల్సి ఉండడంతో ఓట్ల లెక్కింపు పక్రియ ఒకరోజు కంటే ఎక్కువ సమయం పట్టనుంది. కౌంటింగ్ కోసం మొత్తం 1,606 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తునట్టు అధికారులు వెల్లడించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + seventeen =