ప్రముఖ హాస్య నటుడు వివేక్ కు గుండెపోటు, ఆసుపత్రిలో చికిత్స

actor vivek hospitalized, Actor Vivek is Hospitalized After Heart Attack, Actor Vivek suffers a heart attack, Comedian Vivek Hospitalized due to Heart Attack, Famous Tamil Comedian Vivek Hospitalized, Famous Tamil Comedian Vivek Hospitalized due to Heart Attack, Mango News, Tamil actor Vivek suffers heart attack after taking vaccine, Tamil Comedian Vivek Hospitalized

ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వివేక్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించడానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆయనకు ఎక్మో ట్రీట్‌మెంట్ అందిస్తునట్టు వైద్యులు తెలిపారు.

మరోవైపు గురువారం నాడే వివేక్ కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హత కలిగిన ప్రజలంతా ముందుకు రావాలని కోరారు. వివేక్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకుంది. వివేక్ ‌త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ