కరోనా నేపథ్యంలో కేంద్ర కీలక నిర్ణయం, చారిత్రక కట్టడాలు మూసివేత

Centre Decided to Close Historical Monuments Museums, Centre Decided to Close Historical Monuments Museums in India, Centre Decided to Close Historical Monuments Museums in India till May 15, Coronavirus India News LIVE Updates, COVID-19 pandemic in India, Historical monuments museums closed till 15 May, Historical monuments museums in India closed, historical monuments sites museums ASI closed till May 15, India Coronavirus, India Covid-19 Updates, Mango News

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజువారిగా భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు కరోనా నియంత్రణ చర్యలు అమల్లోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక చిహ్నాలు/స్థలాలు, మ్యూజియాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.

“ప్రస్తుత కరోనా పరిస్థితి కారణంగా ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) క్రింద కేంద్ర ప్రభుత్వ సంరక్షణలో ఉండే అన్ని స్మారక చిహ్నాలు/స్థలాలు, మ్యూజియమ్ ‌లను మే 15 వరకు లేదా తదుపరి ఆదేశాల వరకు మూసివేయాలని నిర్ణయించాం. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయి” అని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) ప్రహ్లాద్ సింగ్ పటేల్ వెల్లడించారు. గతంలో కూడా కరోనా పరిస్థితుల దృష్ట్యా చారిత్రక కట్టడాలకు సందర్శనకు ప్రజలకు అనుమతి నిలిపివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో ఏప్రిల్ 16, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,91,917 కు చేరింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 13 =