ఉద్యోగ నియామకాలు: తెలంగాణ‌ రాష్ట్రంలో అమల్లోకి వచ్చే నూత‌న‌ జోన్లు ఇవే…

Union Govt has Approved Telangana State New Zonal System,Mango News,Mango New Telugu,Telangana,Telangana News,Telangana State,Telangana State New Zonal System,Telangana New Zonal System,Union Govt,Union Govt Latest News,TS News,Union Govt Approved Telangana State New Zonal System,Union Govt Approved TS State New Zonal System,Union Government Has Approved The Telangana State Government's New Zonal System,Recruitment Of Staff For State Government,Telangana New Zones,TS Govt,TS New Zonal System,New Zones,Govt Jobs,Telangana Policy To Grant Govt Jobs To Locals,Telangana State Government's New Zonal System,State Government Services,Telangana New Zones List,Telangana State New Zones List

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జోనల్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ఆర్డర్‌-2018కి ఆమోదముద్ర వేస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం నాడు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. తెలంగాణలో ప్రస్తుతం రెండు జోన్లు ఉండగా నూతన జోనల్ విధానం ప్రకారం 7 జోన్లు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో పోలీసు నియ‌మాకాల‌కు తప్ప మిగిలిన అన్ని విభాగాల‌కు నూతన జోన్ల విధానం వర్తించనున్నది. త్వరలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం చేపట్టబోయే ఉద్యోగ నియామకాలను నూతన జోన్లవారీగానే చేపట్టనున్నారు.

తెలంగాణ‌ రాష్ట్రంలో అమల్లోకి వచ్చే నూత‌న‌ జోన్లు ఇవే:

మల్టీ జోన్ 1:

జోన్ 1: కాళేశ్వ‌రం జోన్

  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా
  • మంచిర్యాల
  • కొమురం భీం ఆసిఫాబాద్
  • పెద్దపల్లి
  • ములుగు

జోన్ 2: బాస‌ర జోన్

  • ఆదిలాబాద్ జిల్లా
  • నిర్మల్
  • నిజామాబాద్
  • జగిత్యాల

జోన్ 3: రాజన్న జోన్‌

  • రాజన్న సిరిసిల్ల జిల్లా
  • కామారెడ్డి
  • మెదక్
  • కరీంనగర్
  • సిద్దిపేట

జోన్ 4: భ‌ద్రాద్రి జోన్

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
  • ఖమ్మం
  • వరంగల్‌ రూరల్
  • వరంగల్‌ అర్బన్
  • మహబూబాబాద్

మల్టీ జోన్ 2:

జోన్ 5: యాదాద్రి జోన్

  • యాదాద్రి భువనగిరి జిల్లా
  • జనగామ
  • సూర్యాపేట
  • నల్గొండ

జోన్ 6: చార్మినార్‌ జోన్

  • హైదరాబాద్ జిల్లా
  • రంగారెడ్డి
  • మేడ్చల్ మల్కాజిగిరి
  • సంగారెడ్డి
  • వికారాబాద్

జోన్ 7 : జోగులాంబ జోన్

  • మహబూబ్‌నగర్ జిల్లా
  • నారాయణ్ పేట్
  • వనపర్తి
  • జోగులాంబ గద్వాల
  • నాగర్‌ కర్నూల్
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ