ఏపీలో మాస్కు ధరించని వారికీ రూ.100 ఫైన్, థియేటర్లతో 50 శాతం సీటింగ్ సామర్ధ్యం

CM YS Jagan Orders Officials to Impose Fine Rs 100 for who do not Wear Mask,CM YS Jagan,CM YS Jagan Latest News,CM YS Jagan Live,CM YS Jagan Live Updates,CM YS Jagan Updates,CM YS Jagan Latest Updates,CM YS Jagan News,AP CM YS Jagan Latest News,CM YS Jagan Press Meet,Fine Of Rs 100 To Be Imposed,Fine Of Rs 100 For Not Wearing Masks In Andhra Pradesh,Andhra Pradesh,AP News,AP Corona Updates,CM YS Jagan Orders Officials,Fine Of Rs 100 To Be Imposed For Not Wearing Masks In AP,Rs 100 Fine For Not Wearing Masks In AP,Fine Of Rs 100 For Who Do Not Wear Mask In AP,Rs 100 Penalty For Not Wearing Masks,AP Covid News,AP CM YS Jagan Live,Andhra Pradesh News,Mango News,Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి సోమవారం నాడు క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని, ఎవరైనా మాస్కు ధరించకుంటే రూ.100 ఫైన్‌ విధించాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఏప్రిల్ 20, మంగళవారం నుంచి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు స్కూళ్లు, హాస్టళ్లు, కోచింగ్‌ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. అయితే టెన్త్, ఇంటర్మీడియెట్‌ పరీక్షలను అన్ని కరోనా‌ నిబంధనలు అనుసరిస్తూ షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు.

ఇక సినిమా థియేటర్స్, ఫంక్షన్‌ హాళ్లు, హోటళ్లలో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా చూడాలని చెప్పారు. ఫంక్షన్ హాళ్లలో రెండు కుర్చీల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా చూడాలని, అదేవిధంగా సినిమా థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య తప్పనిసరిగా ఒక సీటు ఖాళీగా ఉంచేలా (50 శాతం సీటింగ్ సామర్ధ్యం) చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మరోవైపు కరోనా‌ సమస్యలకు సంబంధించి 104 నంబరు పరిష్కారంగా ఉండాలని, 104 కాల్‌ సెంటర్‌ కు విస్తృత ప్రచారం కల్పించాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − ten =