గ్రామ సచివాలయ ఉద్యోగాల పై సీఎం జగన్ సూచనలు

CM Jagan Directions Over Village Secretariat Jobs,Mango News,CM Jagan Directions Towards Village Secretariat Jobs,DSCs to recruit staff for village secretariats,AP Grama Sachivalayam Jobs 2019,Recruitment of village volunteers set to begin in Andhra Pradesh,AP Grama Volunteer Recruitment 2019,AP Grama Sachivalayam 2019

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఇందులో గ్రామ సచివాలయాలు ఏర్పాటు, అందుకు సంబందించిన ఉద్యోగాల గురించి కీలక సూచనలు చేసారు. జులై 15 నాటికీ, గ్రామ సచివాలయాల ఉద్యోగాల నియామక పక్రియ నోటిఫికేషన్ విడుదల చేయాలనీ అధికారులకు సూచించారు. ప్రతి 2 వేల జనాభా కు ఒక గ్రామ సచివాలయం ఉండాలని,ఈ ఉద్యోగాలను ఎటువంటి అవకతవకలు లేకుండా డిఎస్సి ద్వారా భర్తీ చేయాలనీ కోరారు.

సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి, 2019 అక్టోబర్ 2 నుండి రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలనీ ప్రభుత్వ అధికారులని ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం ఈ ఉద్యోగాల గురించి పలు సూచనలు చేసారు, ఎంతమంది వాలంటీర్లను నియమించుకోవాలి, వారి ఎన్నిక, ఇతర అంశాలపై ప్రభుత్వం నుండి స్పష్టత ఇచ్చారు.కొత్తగా ఏర్పాటు చేసే గ్రామ సచివాలయంలో 12 మంది సిబ్బందిని నియమించాలని, అంతే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 9,480 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 12 =