తెలంగాణ పై మోడీ వివక్ష చూపిస్తున్నాడు

Revanth Reddy Comments On Union Budget,Mango News,Revanth Reddy Comments Over Union Budget Session 2019,Congress Leader Revanth Reddy Responds on Union Budget 2019,Union Budget 2019 Congress MP Revanth Reddy Comments,Revanth Reddy Comments on Union Budget 2019 Today,Union Budget Sessions,Budget 2019 Live Updates

మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ రోజు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై స్పందించారు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన దగ్గరనుండి, మోడీ ప్రభుత్వం ఆరు బడ్జెట్ లు ప్రవేశపెట్టిందని, ఇంత వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తెచ్చుకున్నది, మోడీ ఇచ్చింది ఏది లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ యొక్క అసమర్ధతను వాడుకొని, మోడీ రాష్ట్రము పై వివక్ష చూపుతున్నారని పేర్కొన్నారు.

ఈ రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ప్రధాని ఆర్బాటం ప్రచారాలే ఉన్నాయని, రూ. 27,86,349 కోట్ల తో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో, 30 శాతం మాత్రమే ఆస్తుల పెంపు కి కేటాయించింది అని , తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఎటువంటి సహాయం చేయలేదని తెలిపారు. ఆదాయపు పన్ను లో మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం లేదని, సామాన్య ప్రజలపై ఇంకా భారం మోపారని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలపై మోడీ వివక్ష కొనసాగుతుందని, ఆర్థిక మంత్రి దక్షిణాది వారైనా ప్రధాని మంత్రి మోడీ ఎలా చెపితే అలాగే నడుచుకున్నారని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =