రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా పలుసంస్థలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చర్యలకు మద్ధతుగా ఏపీ సీఎం సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) రూ.100 కోట్ల భారీ విరాళం అందించింది. డీఎంఎఫ్ నుంచి రూ.90 కోట్లు, ఏపీఎండీసీ నుంచి రూ.10 కోట్లను విరాళంగా అందించారు. అందుకు సంబంధించిన రూ.100 కోట్ల చెక్కులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంగళవారం నాడు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఏపీఎండీసీ ఎండీ వెంకట్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ