కడపలో ‘రాయలసీమ రణభేరి సభ’ నిర్వహించిన బీజేపీ.. హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సునీల్ దేవధర్

AP Union Minister Kishan Reddy Attends Rayalaseema Ranabheri Sabha At Kadapa Today, AP Union Minister Kishan Reddy, Kishan Reddy Attends Rayalaseema Ranabheri Sabha At Kadapa Today, Union Minister Kishan Reddy Attends Rayalaseema Ranabheri Sabha At Kadapa Today, Rayalaseema Ranabheri Sabha At Kadapa, Union Minister Kishan Reddy, Union Minister, Kishan Reddy, Rayalaseema Ranabheri Sabha, Rayalaseema Ranabheri Sabha Latest News, Rayalaseema Ranabheri Sabha Latest Updates, Rayalaseema Ranabheri Sabha Live Updates, Ranabheri Sabha, Rayalaseema, Minister Kishan Reddy Attends Rayalaseema Ranabheri Sabha At Kadapa, Kadapa Rayalaseema Ranabheri Sabha, AP, Mango News, Mango News Telugu,

ఈరోజు కడపలో రాయలసీమ ప్రాంత సమస్యలపై “రాయలసీమ రణభేరి” పేరుతో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. రాయలసీమ అభివృద్దిపై వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలకు నిరసనగా బీజేపీ ఈ సభను నిర్వహించింది. దీనికి పలువురు కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలు హాజరయ్యారు. కేంద్రమంత్రి కిషన్ ‌రెడ్డి, జాతీయ నేత సునీల్ దేవధర్, ఏపి అధ్యక్షుడు సోమువీర్రాజు పాల్గొన్నారు. అలాగే బీజేపీ ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావు తదితరులు హాజరయ్యారు. మాజీమంత్రులు పురందేశ్వరి, ఆదినారాయణరెడ్డిలతో పాటు రాష్ట్ర నేతలు, రాయలసీమ జిల్లాలకు సంబంధించిన జిల్లా స్థాయి నాయకులు ఈ సమావేశానికి తరలివచ్చారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధికై మొట్టమొదట గళం వినిపించింది బీజేపీ యేనని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ లోని కడప, తిరుపతి, అనంతపురం జిల్లాలలో ఎన్నో సంస్థలు నిర్మించిందని, ఇంకా పలు ప్రాజెక్టులు ఇవ్వనుందని తెలిపారు. దేశంలోని ప్రతి రైతుకి కేంద్రం ఏటా 6 వేల రూపాయలు అందిస్తోందని వెల్లడించారు. భవిష్యత్తులో ఏపీలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కిషన్ ‌రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =