కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా ప్రముఖ పార్మా కంపెనీలు విరాళాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం చర్యలకు మద్దతుగా నాట్కో ఫార్మా లిమిటెడ్ లక్ష మంది పేషంట్లకు బారిసిటినిబ్ టాబ్లెట్స్ ను తెలంగాణ ప్రభుత్వానికి విరాళంగా ప్రకటించింది. బారిసిటినిబ్ టాబ్లెట్స్ ను కోవిడ్-19 చికిత్సలో ఉపయోగించనున్నారు. ప్రభుత్వం ద్వారా మొత్తం రూ.4.2 కోట్ల విలువైన టాబ్లెట్స్ ను అందించనున్నట్టు పేర్కొన్నారు. ఈ విరాళానికి సంబంధించిన పత్రాన్ని శుక్రవారం నాడు నాట్కో పార్మా లిమిటెడ్ సీఈవో రాజీవ్ నన్నపనేని తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సాయం అందించేందుకు ముందుకొచ్చిన నాట్కో పార్మా సంస్థకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ