కేరళలో మే 23 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు, 4 జిల్లాల్లో ట్రిపుల్ లాక్‌డౌన్‌

Kerala Govt Extends Complete Lockdown in the State till May 23rd,Mango News,Mango News Telugu,Kerala Extends Lockdown Till May 23 To Curb Covid-19 Spread,Kerala Government Extends Lockdown Till May 23,Coronavirus,Kerala Extends Lockdown Till May 23,Kerala Extends Lockdown,Covid-19,Kerala Government Extends Lockdown Till May 23,Total Lockdown In Kerala Extended Till May 23,Kerala Lockdown Extension News Today,Lockdown In Kerala,Latest News 2021,Kerala Lockdown Latest News,Kerala Lockdown News Today,Kerala Lockdown 2021,Kerala Lockdown Latest,Lockdown In Kerala Today,Kerala Lockdown Extension,Kerala Lockdown

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ ను పొడిగిస్తూ కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా మే 8వ తేది నుంచి మే 16 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించారు, అయితే కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా నమోదవుతుండడంతో లాక్‌డౌన్‌ ను మే 23 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్టు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం నాడు ప్రకటించారు. అలాగే కరోనా పరీక్షల్లో అత్యధికంగా పాజిటివిటీ రేటు నమోదవుతున్న తిరువనంతపురం, ఎర్నాకుళం, త్రిస్సూర్, మలప్పురం వంటి నాలుగు జిల్లాల్లో ట్రిపుల్ లాక్‌డౌన్ విధించనున్నట్టు పేర్కొన్నారు.

ఇక రాష్ట్రంలో 18-44 ఏళ్ళ వారికీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు శనివారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని, సోమవారం నుండి వ్యాక్సిన్ వేయనున్నట్టు తెలిపారు. మరోవైపు కేరళలో ఇప్పటివరకు మొత్తం 20,85,584 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 16,36,790 మంది కరోనా నుంచి కోలుకోగా, 6,244 మంది మరణించారు. ప్రస్తుతం 4,42,191 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో కేరళ మూడో స్థానంలో కొనసాగుతుంది. అలాగే ప్రస్తుతం అత్యధిక యాక్టీవ్ కేసులు కలిగి ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక (5,98,605) మహారాష్ట్ర(5,19,254), తర్వాత కేరళ (4,42,191) మూడో స్థానంలో ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + eight =