ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 18, మంగళవారం నాడు ‘వైఎస్ఆర్ మత్స్యకార భరోసా’ పథకం కింద రూ.119.88 కోట్ల నిధులు విడుదల చేశారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద వరుసగా మూడో ఏడాది రాష్ట్రంలోని 1,19,875 లబ్ధిదార మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.119.88 కోట్లను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి సంవత్సరం ఏపీ ప్రభుత్వం రూ.10 వేలు ఆర్ధికసాయం అందిస్తుంది. 2019, 2020లో ఇప్పటికే రూ.211.71 కోట్ల ఆర్ధికసాయం అందించగా, ఈ ఏడాది రూ.119.88 కోట్లతో కలిపి మొత్తం మూడేళ్లలో ఈ పథకం కింద మత్స్యకార కుటుంబాలను రూ.331.58 కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్టు అయింది.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, వరుసగా మూడో ఏడాది కూడా ఈ పథకాన్ని అమలుచేస్తున్నామన్నారు. కరోనా లాంటి కష్టసమయంలో ఆర్ధికవనరులు సమస్య ఉన్నా, పేదవారికి ఎలాంటి ఇబ్బందికి లేకుండా చూడాలనే తపనతోనే ఈ రోజు 1,19,875 మత్స్యకార కుటుంబాలకు 10 వేలు చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ అయ్యేలా రూ.119.88 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. అలాగే 100 పెట్రోల్ బ్యాంకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మత్స్యకారులకు సంబంధించిన బోట్స్/మరపడవలు, ఇంజను కలిగిన తెప్పలకు డీజిల్పై లీటర్ కు అందించే రాయితీని రూ.9 కు పెంచామని సీఎం పేర్కొన్నారు. ఇక తమ పభుత్వం అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతులకు కూడా తోడుగా నిలిచి సహాయం అందించామన్నారు. రూ.50 కోట్లకు పైగా నిధులతో రాష్ట్రంలో 35 చోట్ల ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ లు ఏర్పాటు చేశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ