రాష్ట్రంలో లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ యూనిట్లు, పీఎస్ఏ ప్లాంట్లపై మంత్రి హరీశ్ రావు, సీఎస్ సమీక్ష

Minister Harish Rao, CS Somesh Kumar Held a Meeting on Construction of Liquid Oxygen storage Units,Mango News,Mango News Telugu,Provide Equipment For Oxygen Supply,Finance Minister T Harish Rao Tells Firms,Telangana Minister Holds Meeting,Harish Rao On Construction Of Oxygen Storage Units,Construction Of Oxygen Storage Units,Oxygen Storage Units,Harish Rao Direct Companies To Supply Equipment For Supply Of Oxygen,Harish Rao Gets Health Responsibility,Meeting On Liquid Oxygen Storage Units,Minister Harish Rao Latest News,Minister Harish Rao News,Minister Harish RaoLive,Minister Harish Rao News,CS Somesh Kumar,CS Somesh Kumar Live

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లు మంగళవారం బిఆర్కెఆర్ భవన్ లో రాష్ట్రంలోని కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరాకై లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ యూనిట్లు, పీఎస్ఏ ప్లాంట్ల నిర్మాణం, క్రయోజినిక్ ట్యాంకర్ల సరఫరా తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా మంత్రి హరీశ్ రావు మరియు సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు సంబంధించి సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం వెంటనే తగు చర్యలను ప్రారంభించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా నిమిత్తం అవసరమైన పీఎస్ఏ ప్లాంట్లు, సామాగ్రి తదితర అంశాలకు సంబంధించి వెంటనే చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడిసీ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + eighteen =