ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 22, మంగళవారం నాడు రెండో ఏడాది “వైఎస్ఆర్ చేయూత” కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా నేరుగా 23,14,342 మంది మహిళలకు రూ.4,339.39 కోట్లు జమ చేశారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45–60 ఏళ్లలోపు అర్హత గల మహిళలకు చేయూతను అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన మహిళలకు ప్రతి సంవత్సరం రూ.18,750 చొప్పున నాలుగు సంవత్సరాల్లో మొత్తంగా రూ.75 వేలు అందజేయనున్నారు. ఈ రోజు అందిస్తున్న రూ.4,339.39 కోట్లతో కలిపి మొదటి, రెండో విడతల్లో రాష్ట్రంలో అర్హులైన మహిళలకు రూ.8,943 కోట్ల అందజేసినట్లు అయింది. నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా మహిళలకు ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.19,000 కోట్లు అందజేయనుంది.
రాష్ట్రంలో మహిళా స్వయం సాధికారితపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రముఖ కంపెనీలైన అమూల్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గాంబిల్, రిలయన్స్ లతో ఎంఓయూలు కుదుర్చుకొని మహిళలుకు చేయూత అందించడంలో భాగంగా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 78 వేల మంది మహిళలు కిరాణా షాపులు, 1,90,517 మంది గేదెలు, ఆవులు, గొర్రెలు మేకలు పెంపకంతో వారి కుటుంబ ఆదాయాన్నిపెంపొందించుకుంటున్నారు. అయితే ఈ పథకం ద్వారా పొందే డబ్బును ఉపయోగించుకోవడంలో అర్హులైన మహిళలకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ నిచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ