హైదరాబాద్ నగరంలోని అంబేద్కర్ నగర్ లో రూ.28 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన 330 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నాడు ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి, ఇళ్ల తాళాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.
హైదరాబాద్ లో రూ.9 వేల కోట్లతో ఇళ్లు నిర్మాణం, దేశంలో ఇలా ఏ నగరంలో లేదు:
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, అంబేద్కర్ నగర్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని ఇక్కడి ప్రజలు చెబుతున్నారని, ఒక పండుగా వాతావరణంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారని చెప్పారు. ఇదే స్థలంలో ప్రైవేట్ వారు అపార్ట్‌మెంట్ కడితే, విలువ కోటిన్నరగా ఉండేదని, అయితే ఒక్క పైసా తీసుకోకుండా సీఎం కేసీఆర్ ఇళ్లు నిర్మించి ఇచ్చారని ప్రజలు చెప్తున్నప్పుడు గుండె సంతోషంతో ఉప్పొంగిపోయిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎందుకంటే ఇంతకంటే గొప్పసేవ ఏమి ఉండదన్నారు. పెద్దలు ఎప్పుడు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటుంటారని, మనిషి జీవితంలో ఈ రెండు కష్టంతో కూడుకున్న పనులని అన్నారు. కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇల్లు కట్టించి, కల్యాణలక్ష్మీ, షాదిముబారక్ ద్వారా ఆడ పిల్లల పెళ్లిళ్లకు అండగా నిలుస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని చెప్పారు. అలాగే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో రూ.9 వేలకుపైగా కోట్లతో ఇళ్లు కట్టిస్తున్నామని, ఇలా హైదరాబాద్ లో జరిగినట్టు దేశంలో ఏ నగరంలో కూడా ఇళ్ల నిర్మాణం జరగట్లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ