సీఎం కేసీఆర్ కలిసిన పీఆర్టీయూ నాయకులు, ఉపాధ్యాయ సమస్యలు, స్కూల్స్ వాయిదాపై విజ్ఞప్తి

CM KCR, Mango News, Schools Reopening, Telangana Pradesh Congress Committee, Telangana Schools Reopening, Telangana Schools Reopening News, Telangana Schools Reopening Updates, TS Govt Takes Key Decision on Schools Reopening Date, TS PRTU Leaders, TS PRTU Leaders Meet CM KCR, TS PRTU Leaders Meet CM KCR on Schools Reopening, TS PRTU Leaders Meet CM KCR on Schools Reopening and Promotions

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీఆర్టీయూ-టీఎస్ నాయకులు శనివారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి వినతి పత్రం సమర్పించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన కేడర్ విభజన పూర్తి చేసి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని వారు కోరారు. అలాగే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలల పున:ప్రారంభాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని, ఆన్ లైన్ లోనే విద్యా బోధన కొనసాగించాలని, 50 శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా ఆదేశించాలని వారు సీఎంకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్ రెడ్డి, కూర రఘోత్తం రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + two =