సింగరేణి కార్మికుల పదవీవిరమణ వయస్సు పెంపు విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూల స్పందన

CM KCR Responded Positively over Enhance the Retirement Age of Singareni Employees to 61 Years

సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రతినిధులు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో కలిసి విజ్ఞప్తి చేశారు. వారి వినతి పత్రాన్ని అందుకున్న సీఎం కేసీఆర్ దీనిపై సానుకూలంగా స్పందించారు. సీఎంను కలిసిన వారిలో ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, కార్మిక నాయకులు వెంకట్రావు, రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, తదితరులు ఉన్నారు. మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయోపరిమితిని 61 సంవత్సరాలకు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ