టీ20 ప్రపంచకప్‌ గ్రూపులను విడుదల చేసిన ఐసీసీ, ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్

Arch-rivals India, ICC Men’s T20 World Cup groups announced, ICC Revealed Groups India Pakistan Placed in Group 2, ICC T20 WC 2021, India Pakistan placed in same group in T20 World Cup, India-Pakistan placed in same group, Mango News, Men’s T20 WC 2021, Pakistan placed in the same group, T20 World Cup, T20 World Cup group stages preview, T20 World Cup-2021, T20 World Cup-2021 In UAE

టీ20 ప్రపంచ కప్-2021 అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు యూఏఈ మరియు ఒమన్లలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ గ్రూపులను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం నాడు విడుదల చేసింది. ఐసీసీ విడుదల చేసిన గ్రూపుల్లో భారత్‌, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూపులో (గ్రూప్-2) ఉన్నాయి. దీంతో మరోసారి దాయాదుల మధ్య పోరు జరగనుంది. సూపర్‌-12లో గ్రూప్-ఏ, గ్రూప్-బి జట్లతో పాటుగా, తోలి రౌండ్ లో పాల్గొనే గ్రూప్‌-ఎ, గ్రూప్-బి జట్లను ఐసీసీ ప్రకటించింది. ముందుగా రౌండ్-1 లో గ్రూప్‌-ఎ, గ్రూప్-బి జట్లు తలపడనున్నాయి. అనంతరం ఈ రెండు గ్రూపుల్లోని విన్నర్, రన్నరప్‌ జట్లు సూపర్‌-12లో ఇప్పటికే అర్హత సాధించిన మిగిలిన 8 జట్లతో చేరనున్నాయి.

ఈ టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ భారత్ లో జరగాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ పరిణామాల నేపథ్యంలో యూఏఈ మరియు ఒమన్లకు మార్చారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం, షార్జా స్టేడియం మరియు ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్ అనే నాలుగు వేదికలలో బీసీసీఐ ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యమివ్వనుంది. అయితే ఈ టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

టీ20 ప్రపంచ కప్-2021: సూపర్ 12

గ్రూప్‌-1 :

  1. ఇంగ్లాండ్‌
  2. ఆస్ట్రేలియా
  3. దక్షిణాఫ్రికా
  4. వెస్టిండీస్‌లు
  5. విన్నర్- గ్రూప్‌-ఎ
  6. రన్నరప్-గ్రూప్-బి

గ్రూప్‌-2 :

  1. భారత్‌
  2. పాకిస్థాన్‌
  3. న్యూజిలాండ్‌
  4. ఆఫ్ఘనిస్థాన్
  5. రన్నరప్-గ్రూప్-ఏ
  6. విన్నర్- గ్రూప్‌-బి

టీ20 ప్రపంచ కప్-2021: రౌండ్ 1

గ్రూప్‌-ఎ:

  • శ్రీలంక
  • ఐర్లాండ్‌
  • నెదర్లాండ్స్‌
  • నమీబియా

గ్రూప్‌-బి:

  • బంగ్లాదేశ్‌
  • స్కాట్లాండ్‌
  • పపువా న్యూగినియా
  • ఒమన్‌
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =