దేశంలో 46 జిల్లాల్లో 10% కంటే ఎక్కువగా కరోనా పాజిటివిటీ రేటు, 10 రాష్ట్రాల్లో పరిస్థితులపై కేంద్రం సమీక్ష

Centre Held Review on COVID-19 Situation in 10 States, Centre Held Review on COVID-19 Situation in 10 States Amid Upsurge in Positive Cases, Centre Review on COVID-19 Situation in 10 States, Centre Team, Coronavirus Cases, coronavirus cases india, coronavirus india, COVID-19 Situation, India Coronavirus, India Covid-19 Updates, Mango News, total corona positive in india, Upsurge in Positive Cases

దేశంలో గత కొన్ని రోజులుగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అస్సాం, మిజోరం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్ మరియు మణిపూర్ రాష్ట్రాలలోని కరోనాపరిస్థితులను సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ శనివారం నాడు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. గత కొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు, పాజిటివిటీ రేటులో పెరుగుదలను నివేదిస్తున్న ఈ రాష్ట్రాల్లో కరోనాపై నిఘా, కంటైన్మెంట్, నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలను కూడా సమీక్షించారు. ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరాం భార్గవ, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మిషన్ డైరెక్టర్, ఈ 10 రాష్ట్రాల సర్వైలెన్స్ అధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో 46 జిల్లాల్లో 10 శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉండగా, మరో 53 జిల్లాలు 5-10 శాతాన్ని నివేదిస్తున్నాయని చెప్పారు. రోజువారీ కరోనా పరీక్షలను మరింతగా పెంచాలని రాష్ట్రాలను కోరారు. ఈ సందర్భంగా ఈ రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ పలు కీలక సూచనలు చేశారు.

గత కొన్ని వారాలుగా 10 శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో ప్రజల రద్దీని నివారించడానికి మరియు వ్యక్తుల కలయికను నివారించడానికి కఠినమైన ఆంక్షలు అమలు చేయాలని చెప్పారు. ఈ దశలో అలసత్వం వహిస్తే ఆయా జిల్లాల్లో పరిస్థితి దిగజారుతుందని అన్నారు. ఈ రాష్ట్రాల్లో 80శాతం కంటే ఎక్కువ యాక్టివ్ కేసులు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు నివేదించబడిందని, దీంతో ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఈ కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే రాష్ట్రాలు పాజిటివిటీ రేటు 10 శాతం కంటే తక్కువగా ఉన్న జిల్లాలపై కూడా దృష్టి పెట్టాలని, అక్కడ వ్యాక్సినేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

గత రెండు నెలలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్స్, ఆక్సిజన్ సిలిండర్లు మరియు పీఎస్ఏ ప్లాంట్లను అందిస్తుందని, ఇందుకు అదనంగా, ప్రభుత్వ ఆసుపత్రులలో పీఎస్ఏ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలు తమ సొంత వనరులను ఉపయోగిస్తున్నాయన్నారు. హాస్పిటల్ ఆధారిత పీఎస్ఏ ప్లాంట్లను పెట్టడానికి ప్రైవేట్ ఆసుపత్రులను కూడా ఆదేశించాలని రాష్ట్రాలకు సూచించారు. అధిక కేసులను నివేదించే క్లస్టర్‌లలో ఇంటెన్సివ్ కంటైన్మెంట్ మరియు యాక్టివ్ నిఘా చర్యలు చేపట్టాలని చెప్పారు. పాజిటివ్ కేసులు మరియు కాంటాక్ట్ ట్రేసింగ్ మ్యాపింగ్ ఆధారంగా కంటైన్మెంట్ జోన్‌లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరాం భార్గవ మాట్లాడుతూ

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =