దేశంలో 2.27 లక్షలమందికి పైగా గర్భిణీ స్త్రీలకు కోవిడ్ వ్యాక్సిన్

2.27 Lakh Pregnant Women Given First Dose of Covid-19 Vaccine, Centre, Centre Says Over 2.27 Lakh Pregnant Women Given First Dose of Covid-19 Vaccine, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination, Distribution For Covid-19 Vaccine, India Covid Vaccination, Mango News, Pregnant Women Covid-19 Vaccine, Pregnant Women Given First Dose of Covid-19 Vaccine, Vaccine Distribution

నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టీఏజీఐ) సిఫారసుల ఆధారంగా దేశంలో గర్భిణీ స్త్రీలకు కోవిడ్ వ్యాక్సిన్ వేయడానికి జూలై 2న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో కొనసాగుతున్న నేషనల్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 2.27 లక్షలకుపైగా గర్భిణీలు కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గర్భిణీ స్త్రీలకు కోవిడ్ సోకితే వచ్చే ప్రమాదాలు, కోవిడ్ వ్యాక్సిన్ వలన కలిగే ప్రయోజనాల గురించి హెల్త్ వర్కర్స్ మరియు వైద్య అధికారుల ద్వారా గర్భిణీ స్త్రీలకు క్రమం తప్పకుండా ఇస్తున్న కౌన్సెలింగ్ ఫలితాలను ఇస్తుందని చెప్పారు.

ఇక 78,838 మంది గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్ వేయడం ద్వారా తమిళనాడు రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 34,228, ఒడిషాలో 29,821, మధ్యప్రదేశ్ లో 21,842, కేరళలో 18,423 మరియు కర్ణాటకలో 16,673 గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు గర్భిణీ స్త్రీలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించడం గురించి ప్రభుత్వ మరియు ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలలో తమ వ్యాక్సినేషన్ బృందాలను మరింత చైతన్యపరిచాయని కేంద్రం తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యల వలన గర్భిణీ స్త్రీలు మరియు వారి కుటుంబాలలో విశ్వాసం పెరుగుతుందని, వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కోవిడ్-19 వ్యాప్తి నుంచి వారికి రక్షణ కలుగుతుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + six =