హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలోనే, తహసీల్దార్ విజయారెడ్డిపై సురేశ్ అనే రైతు పెట్రోలు పోసి సజీవదహనం చేసిన ఘటన రాష్ట్రంలో సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. తహశీల్దార్ విజయ రెడ్డి దారుణ హత్య తరువాత, ప్రభుత్వం కె.వెంకట్ రెడ్డిని అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి కొత్త తహశీల్దార్ గా నియమించింది. ఈ నేపథ్యంలో నవంబరు 22, శుక్రవారం నాడు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ మండలానికి కొన్ని రోజుల పాటు సరూర్‌నగర్ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి ఇన్‌చార్జిగా తహసీల్దార్ గా కొనసాగారు. అయితే పూర్తిస్థాయి తహసీల్దార్‌గా ప్రభుత్వం వెంకట్‌రెడ్డిని నియమించడంతో డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ నుంచి వెంకట్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్‌కు వెళ్లి తహసీల్దార్ కార్యకలాపాల నిర్వహణ నిమిత్తం అక్కడ బీసీ కాలనీలో గల కమ్యూనిటీ భవనాన్ని పరిశీలించారు.
[subscribe]











































