గ్రేటర్ పోరు: రోడ్ షోలతో ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి కేటిఆర్

GHMC Election Campaign, GHMC Election Campaign Schedule, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, GHMC Nominations, Greater Hyderabad Municipal Corporation, KTR, KTR GHMC Election Campaign, KTR GHMC Election Campaign Schedule, Mango News, TRS Working President KTR

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ముఖ్యంగా టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటిఆర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గత ఆరేళ్ళ సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ మళ్ళీ టిఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. ప్రచారానికి తక్కువ సమయమే ఉండడంతో ప్రతి రోజు నగరంలోని వివిధ నియోజకవర్గాల పరిధిలో ఐదు నుంచి ఆరు రోడ్ షోలను నిర్వహిస్తున్నారు. కాగా ఈ రోజు సాయంత్రం నుంచి మంత్రి కేటిఆర్‌ ఉప్పల్ నియోజకవర్గంలో రోడ్‌ షోలు నిర్వహించనున్నారు.

ఈ రోజు మంత్రి కేటిఆర్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే:

  • సాయంత్రం 4 గంటలకు: ఈసీఐఎల్ చౌరస్తా
  • సాయంత్రం 5 గంటలకు: శివ హోటల్ జంక్షన్, మల్లాపూర్
  • సాయంత్రం 6 గంటలకు: చిలుకా నగర్ జంక్షన్
  • సాయంత్రం 7 గంటలకు: హెఛ్పీఎస్ రామంతాపూర్

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =