తెలంగాణలో ఆగస్టు 16 నుండి రెండో విడత రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ విడతలో రూ.25 వేల నుండి రూ.50 వేల వరకు రుణాలున్న రైతుల రుణాలను తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఈ నేపథ్యంలో ఆరో రోజు 20,663 మంది రైతుల ఖాతాలలో రూ.63.05 కోట్ల రుణమాఫీ నిధులు జమ చేసినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. మొత్తం నేటి వరకు 94,695 మంది రైతుల ఖాతాలలో రుణమాఫీ కింద రూ.275.31 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. ఈ నెల 30 వరకు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని, 6.08 లక్షల మంది రైతులకి రుణమాఫీ ద్వారా లబ్ధిచేకూరుతుందని చెప్పారు.
అరక దున్నే రైతన్న ఆర్థిక స్థిరత్వం సాధించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం:
కరోనా విపత్తులో ప్రపంచం విలవిలలాడుతుంటే ధైర్యంగా వ్యవసాయం చేసి ప్రపంచానికి ఆహారం అందించింది అన్నదాతలేనని మంత్రి అన్నారు. “ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఏర్పాటైన మరుక్షణం ముందుచూపుతో సాగునీటి సదుపాయం, ఉచితంగా 24 గంటల కరంటు సరఫరాపై దృష్టి సారించారు. రైతుబంధు, రైతుభీమా పథకాలతో వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతు కుటుంబాలలో ఆత్మవిశ్వాసం నింపారు. అందుకే ఏడేళ్లలో దేశానికి అన్నపూర్ణగా నిలిచే స్థాయికి తెలంగాణ ఎదిగింది. అరక దున్నే రైతన్న ఆర్థిక స్థిరత్వం సాధించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటల సాగు మీద రైతాంగం దృష్టి సారించాలి” మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ