రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు కెప్టెన్ గా కూడా తప్పుకుంటున్నా : విరాట్ కోహ్లీ

Gautam Gambhir, Gautam Gambhir Questions Timing After Virat Kohli Decides, IPL 2021, Kohli to step down as RCB Captain, Mango News, Virat Kohli Decides to Step Down, Virat Kohli Decides to Step Down from RCB Captaincy, Virat Kohli Decides to Step Down from RCB Captaincy after IPL-2021, Virat Kohli to step down as RCB captain, Virat Kohli to step down as RCB captain after IPL 2021

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత భారత టీ20 కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు భారత క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ఇటీవల సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా విరాట్ కోహ్లీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌ 2021 ముగిసిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (ఆర్‌సీబీ) జట్టు కెప్టెన్ గా కూడా తప్పుకుంటున్నట్టు తెలిపాడు. ఈ మేరకు విరాట్ కోహ్లీ ఆదివారం రాత్రి ఆర్‌సీబీ అధికారిక ట్విట్టర్ వేదికగా ఒక వీడియో విడుదల చేశాడు.

ఆర్‌సీబీ జట్టుకు కెప్టెన్‌గా ఇదే తన ఆఖరి ఐపీఎల్‌ అని పేర్కొన్నాడు. అయితే క్రికెటర్‌గా ఐపీఎల్ లో తన చివరి మ్యాచ్ వరకు బెంగళూరు జట్టుతో కొనసాగుతానని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. జట్టు యాజమాన్యం, సిబ్బంది, ఆటగాళ్లతో కెప్టెన్ గా తప్పుకోవడంపై ఇప్పటికే చర్చించినట్టు తెలిపాడు. ఆర్‌సీబీ జట్టుకు కెప్టెన్ గా ఎన్నో అనుభూతులు ఉన్నాయని, ఈ అవకాశం ఇచ్చిన జట్టు యాజమాన్యానికి, తనకు సహకరించిన కోచ్‌లు, ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి విరాట్ కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ